ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh On Jagan: ప్రాణ, ఆస్తి నష్టం అందుకే.. : లోకేశ్‌ - జగన్ ఏరియల్ సర్వేపై లోకేశ్ కామెంట్స్

వాతావ‌ర‌ణ హెచ్చరికలను ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవటం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (lokesh fire on cm jagan over heavy rains) విమర్శించారు. గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనిపిస్తాయని జగన్ ఏరియల్ సర్వేను ఉద్దేశించి వ్యాఖ్యనించిన లోకేశ్.. వర్షాలకు దెబ్బతిన్న రాయ‌ల‌సీమ వైపు సీఎం క‌న్నెత్తి కూడా చూడటం లేదని మండిపడ్డారు.

lokesh fire on cm jagan
ఆ హెచ్చరికలు ప‌ట్టించుకోకపోవడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం

By

Published : Nov 20, 2021, 6:39 PM IST

గాల్లోంచి నేల మీదకు దిగితే వరద కష్టాలు కనిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్​ ఏరియల్ సర్వేను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (lokesh fire on cm jagan over heavy rains) వ్యాఖ్యనించారు. వర్షాలకు దెబ్బతిన్న రాయ‌ల‌సీమ వైపు సీఎం క‌న్నెత్తి చూడలేదని మండిపడ్డారు. వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోకుండా జగన్ క్షుద్ర రాజకీయాలు కొనసాగించడం వల్లే.. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందన్నారు.

భారీ వర్షాల కారణంగా సొంత జిల్లాకు ఏమైందో క‌నుక్కునే తీరికే లేదా? అని సీఎం​ను లోకేశ్ ప్రశ్నించారు. అదానీతో విందులు-వాటాల చ‌ర్చ‌లు, కుప్పంలో ఓడిపోయిన‌ చంద్ర‌బాబు ముఖం చూడాల‌నే సైకో కోరిక‌లతో.. త‌న‌కు జ‌నం క‌ష్టాలు ప‌ట్ట‌వ‌నే విషయాన్ని ముఖ్య‌మంత్రి చెప్ప‌క‌నే చెబుతున్నారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనుకోవటం భ్రమే అవుతుందన్నారు. వరద బాధితులకు సాయం చేయాల్సిందిగా తెదేపా నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

"రోమ్ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించి శాడిస్టు ఆనందం పొందినట్లు జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్ పుట్టిన, అధికారం కట్టబెట్టిన రాయ‌ల‌సీమ అల్లకల్లోలమైతే అటువైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా జగన్ రెడ్డికి రాలేదు. కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ధ ముంపు ప్రాంతాల బాధితుల పట్ల లేదు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే 30మంది గల్లంతై 12మంది చనిపోతే కనీసం కనుక్కోలేని ముఖ్యమంత్రిని ఏమనాలి. రాష్ట్రానికి పొంచి ఉన్న వరద ముప్పును ప‌ట్టించుకోకుండా.. వ్యాపార‌ లావాదేవీలు, పారిశ్రామిక‌వేత్త‌ల‌తో క‌మీష‌న్ల భేటీలు జ‌రపటం సిగ్గుచేటు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా బాధితులకు అండగా ఉండి మానవత్వంతో స్పందిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అనుబంధ విభాగాలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు తోచిన సాయం చేయాలి." -లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే..
రాష్ట్రంలో భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్‌ సర్వే (CM Jagan Aerial survey) నిర్వహించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడప చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశాలిచ్చారు. చిత్తూరు, తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు త్వరితగతిన రూ. 2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

Aerial survey: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ABOUT THE AUTHOR

...view details