గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అన్నదాతను ఆదుకుంటామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప ఎక్కడా అమలు కావట్లేదని ఆరోపించారు. రైతు ఉత్పత్తుల్ని రిటైల్ మార్కెట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను కొని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.
పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: గోరంట్ల - tdp leader gorntla bucheyya chowdri
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. ప్రభుత్వమే వారి ఉత్పత్తులను కొని ఆదుకోవాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి