ఒక్క ఛాన్స్ అంటూ.. పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్... రాయలసీమ, పులిచింతల ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఆస్తులను కాపాడుకునేందుకు కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న 107 ప్రాజెక్టులను బోర్డుపరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరి ఉంటే, నేడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన చెందారు.
న్యాయం చేయండి...
పోలవరం ప్రాజెక్టుకు పునాదులే లేవని గతంలో విమర్శించిన జగన్.. ప్రస్తుతం దాదాపు 100 టీఎంసీల గోదావరి జలాలు ఎలా నిల్వ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపుప్రాంత వాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.