ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి... గ్రామ, వార్డు వాలంటీర్లు వంగి దండాలు పెట్టడం... వైకాపా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని.... తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. కష్టకాలంలో ప్రజలకు భరోసా ఇవ్వకుండా... వైకాపా నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హెల్త్ బులిటెన్ రోజుకు 2 సార్లు ప్రకటించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక తరలిస్తున్నారన్న దేవినేని... ఈ సమయంలో అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రోజుకు రెండు సార్లు హెల్త్ బులిటెన్ ప్రకటించాలి: దేవినేని ఉమ - tdp leader devineni uma
రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ రోజుకు రెండు సార్లు ప్రకటిస్తూ... క్వారంటైన్లో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలందించాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
తెదేపా నేత దేవినేని ఉమ