కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో తనపై దాడికి యత్నించిన దుండగుల్నే... చంద్రబాబు ఇంటిపై దాడి చేయించేందుకు జోగిరమేశ్ తీసుకువచ్చారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. జోగి రమశ్ డ్రైవర్ పెట్టిన కేసు ఆధారంగా తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు 15సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తెదేపా నేతలు చేసిన ఫిర్యాదుపై నామామాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారాలు, అధికార పార్టీ శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలన్న ఉమ.... తప్పు చేసే ప్రతి ఒక్కరి పేరూ నమోదు చేస్తున్నామని హెచ్చరించారు.
DEVINENI : 'తప్పు చేసే ప్రతి ఒక్కరి పేరూ నమోదు చేస్తున్నాం' - MLA jogi ramesh
ఎమ్మెల్యే జోగి రమేశ్ తీరుపై తెదేపా నేత దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేయించిన గుండాల్నే... చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు తీసుకువచ్చారని ఆక్షేపించారు. తప్పు చేసే ప్రతి ఒక్కరి పేరూ నమోదు చేస్తున్నామని హెచ్చరించారు.
తెదేపా నేత దేవినేని ఉమ