జగన్ పాలనలో అరాచకాలు, అన్యాయం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి మాటే లేదని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఏడాది పాలనలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని... అభివృద్ధి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో ప్రభుత్వ విఫలం అనే అంశంపై సామాజిక సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వైజాగ్ కిషోర్, నందిగామ కృష్ణలపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. తెదేపాపై ట్విట్టర్లో అనేక విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డి సంగతి ఏంటని చినరాజప్ప నిలదీశారు.
అరాచకాలు, అన్యాయం తప్ప అభివృద్దే లేదు: చినరాజప్ప - వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప కామెంట్స్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలకు ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయాలని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని మండిపడ్డారు.
tdp leader chinarajappa comments on jagan govt