ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రత్యేక హోదా అంటే సీఎం జగన్ ఎక్కడుంటారో అందరికీ తెలుసు' - సీఎం జగన్​పై బుద్దా వెంకన్న విమర్శల వార్తలు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నవారు.. ఇప్పుడు కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద మెడలు వంచుతున్నారని విమర్శించారు.

budda venkanna
బుద్దా వెంకన్న, తెదేపా నేత

By

Published : Oct 9, 2020, 6:51 PM IST

బుద్దా వెంకన్న ట్వీట్

ప్రత్యేక హోదాను తలచుకుంటే సీఎం జగన్​కు చంచలగూడ జైలు గుర్తుకొస్తోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు కేసుల కోసం మెడలు వంచారని విమర్శించారు. ఈ యూటర్న్​​లు చూసి ఊసరవెల్లులు కూడా హతాశులవుతాయన్నారు. ప్రజలు జగన్​ను పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details