TDP Protest at vijayawada dharna chowk: వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ముఖ్యమంత్రి జగన్ హరించివేస్తున్నారని తెదేపా నేత బోండా ఉమ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెదేపా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న బోండా ఉమ.. రద్దు చేసిన పథకాల్ని పునరుద్ధరించాలని, జగజ్జీవన్ రామ్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలన్నారు. పథకాలను పునరుద్ధరించే వరకు గడప గడపకు ఎస్సీ నాయకులతో కలిసి ఉద్యమిస్తామన్నారు.
'వెనుకబడిన వర్గాల హక్కుల్ని సీఎం జగన్ హరిస్తున్నారు..' - వెనుకబడిన వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారన్న బోండ ఉమా
Bonda Umamaheswara Rao Protest: వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సీఎం జగన్ హరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తెదేపా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన నిరసనలో బోండా ఉమా పాల్గొన్నారు.
bonda umamaheswara rao