ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కుటుంబం ఆత్మహత్యల ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం'

నంద్యాల కుటుంబం ఆత్మహత్యల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేయనున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

bonda uma
bonda uma

By

Published : Nov 11, 2020, 4:04 PM IST

నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేయనున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు జగన్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సలాం భార్యను వేధించినందుకు డీఎస్పీతో సహా సీఐ, హెడ్ కానిస్టేబుల్​పై నిర్భయ కేసు నమోదు చేసి వారిని సర్వీసుల నుంచి డిస్మిస్ చేయాలన్నారు.

కుటుంబం ఆత్మహత్యలకు కారణమైన ప్రధాన నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన ప్రభుత్వం.. సొంత మీడియాలో తెదేపా బెయిల్ ఇప్పించిందని తప్పుడు ప్రచారం చేస్తోందని బోండా దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details