ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MLC ASHOK BABU: ప్రత్యేక ఆహ్వానితుల జీవో రద్దును స్వాగతిస్తున్నాం: అశోక్​బాబు

తితిదే జంబో బోర్డు జీవోను రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్​బాబు పేర్కొన్నారు. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా సీఎం వ్యవహరించరాదని హితవు పలికారు.

By

Published : Sep 22, 2021, 7:24 PM IST

tdp leader ashok babu
అశోక్ బాబు


తితిదే జంబో బోర్డుపై న్యాయస్థానం తీర్పుతో.. ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్లైందని ఎమ్మెల్సీ అశోక్​బాబు అన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జీవోను న్యాయస్థానం సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షిస్తే.. ఆ ధర్మం తిరిగి రక్షిస్తుందన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని హితవు పలికారు.

చట్ట విరుద్ధంగా తితిదే జంబో బోర్డును ఏర్పాటు చేసిందని అశోక్​బాబు మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే తితిదేకు నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. సామాన్యులకు స్వామివారి దర్శనం కష్టతరం చేసేలా ప్రత్యేక ఆహ్వానితుల్ని బోర్డులో నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించటం తగదని హితవు పలికారు.

"ప్రత్యేక ఆహ్వానితుల జీవోను న్యాయస్థానం సస్పెండ్ చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ధర్మాన్ని రక్షిస్తే అది తిరిగి రక్షిస్తుందని జగన్ రెడ్డి గ్రహించాలి. చట్ట విరుద్ధంగా తితిదే జంబో బోర్డు ఏర్పాటు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే తితిదేకు నష్టం. ముఖ్యమంత్రి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్ణయాలు. బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులతో సామాన్యులకు కష్టాలు. దేవుడి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించటం తగదు." - అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ.

ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో.. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది.

ఇదీ చదవండి:

పాఠశాల విద్యా కమిటీల ఎన్నికల్లో రభస.. పలుచోట్ల ఎన్నికలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details