తెదేపాలో పలువురు నాయకులు బాధ్యతారాహిత్యంగా పార్టీ నియమావళిని అతిక్రమించి బహిరంగ విమర్శలు చేయటం తగదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల నిర్వహణపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్ర కార్యాలయానికి తెలపాలని అన్నారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా బహిరంగ విమర్శలు చేసినా లేక ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
TDP: పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు: అచ్చెన్నాయుడు - achenna fired over jc prabhakar reddy
అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ నియమావళిని అతిక్రమించి విమర్శలు చేశారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడు