ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Achchennaidu జగన్​ మూడేళ్లలో మూడు పరిశ్రమలైనా తెచ్చారా - సీఎం జగన్​ పాలనపై అచ్చెన్నాయుడు

TDP leader Achchennaidu జగన్ రెడ్డి మూడేళ్ల పరిపాలనా కాలంలో కనీసం మూడు పరిశ్రమలైనా తెచ్చారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్ రెడ్డి తెచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అబద్దాలు, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయటం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు.

TDP leader Achchennaidu
అచ్చెన్నాయుడు

By

Published : Aug 22, 2022, 4:12 PM IST

TDP leader Achchennaidu జగన్ రెడ్డి మూడేళ్లలో కనీసం మూడు పరిశ్రమలయినా తెచ్చారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్​... తెచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం దావోస్ పర్యటన వల్ల ఏపీకి కలిగిన ప్రయోజనం శూన్యమని కేంద్రం మాటల్లో అర్థమైందన్నారు. ఈ మూడేళ్లలో పరిశ్రమలను వెళ్లగొట్టడం, కక్షసాధింపులతో భవంతులు పడగొట్టడం తప్ప జగన్ సాధించిందేంటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేకనే యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. వైకాపా నేతలు చెప్పినట్టు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు విపరీతంగా వస్తే అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. వైకాపా నేతలు ఇకనైనా అబద్దాలు, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయటం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచితే నమ్మే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం కేవలం రూ.20,200 కోట్లు మాత్రమే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని అచ్చెన్నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details