రాయలసీమ అభివృద్ధిపై సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే నిలిపివేసిన పనులను తక్షణమే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెదేపా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు. విశాఖలో ఒక బెంచ్, అమరావతిలో మరో బెంచ్ కాకుండా పూర్తిస్థాయి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయాన్ని సైతం కర్నూలులో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు.
'ముఖ్యమంత్రికి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా?'
ముఖ్యమంత్రి జగన్కు సీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే... నిలిపివేసిన అభివృద్ధి పనులను వెంటనే కొనసాగించాలని తెదేపా నేత కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
'సీఎంకు... కర్నూలు, రాయలసీమ అభివృద్దిపై చిత్తశుద్ధి ఉందా?'
ఇవీ చూడండి-రైతుల దీక్షకు.. వైద్యుల మద్దతు