రాష్ట్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల రూపంలో పెను భారం మోపుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పెంచిన ఆస్తి, నీటి, డ్రైనేజ్ పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు.
పన్నులు పెంచుతూ తెచ్చిన జీవో నెంబర్ 196, 197, 198లను రద్దు చేయాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. పన్నుల భారాలు తగ్గించాలని చంద్రబాబు అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం అప్పులు చేసేందుకు సామాన్యులపై భారం మోపడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పక్షాన తెదేపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.