పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు, నియోజకవర్గాల వారీగా నేతలతో సమన్వయానికి తెదేపా సమన్వయకర్తలను నియమించింది. 25 లోక్‌సభ స్థానాల్ని 5 జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌కి క్షేత్రస్థాయిలో ఒకరికి, పార్టీ కార్యాలయంలో ఒకరికి బాధ్యత అప్పగించింది. క్షేత్రస్థాయి సమన్వయకర్తలుగా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది.
TDP Coordinators: తెదేపా సమన్వయకర్తల నియామకం - విజయవాడ వార్తలు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు, నియోజకవర్గాలవారీగా నేతలతో సమన్వయానికి నేతలను నియమించింది. ఈ పద్ధతి ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
TDP Coordinators