ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

appsc: గ్రూప్-1 పరీక్షల్లో తప్పులపై పిటిషన్.. ఏపీపీఎస్సీకి సుప్రీం నోటీసులు - గ్రూప్ 1 పరీక్ష వార్తలు

గ్రూప్-1 పరీక్ష తెలుగు అనువాదంలో జరిగిన తప్పుల విషయంలో పరీక్షార్థులు దాఖలు చేసిన పిటిషన్​పై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఏపీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

appsc
appsc

By

Published : Jul 24, 2021, 7:09 AM IST

గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తెలుగు అనువాదంలో జరిగిన తప్పుల విషయంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పరీక్షార్థులు దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం ఏపీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. పరీక్ష తెలుగులో నిర్వహించినప్పటికీ ఆంగ్లమే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు చెప్పటాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీం కోర్టును అశ్రయించారు.

ఇందులో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో పేపర్-1(జనరల్ స్టడీస్), పేపర్-2(జనరల్ ఆప్టిట్యూడ్)కు చెందిన తెలుగు అనువాదంలో 51 తప్పులు జరిగాయని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. శుక్రవారం ఈ కేసును జస్టిస్ సంజయ్ కిషన్​కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ... ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్​లో రూపొందిస్తాం..దాన్ని ఎవరికి తెలియకుండా తెలుగులోకి అనువాదం చేయిస్తాం. అందులో తప్పలున్నా తమకేమీ సంబంధం లేదన్న ధోరణితో ఏపీపీఎస్సీ వ్యవహరించటం దురదృష్ణకరమని చెప్పారు.

పోటీ పరీక్షలో 120 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుందని... ఇలాంటి సమయంలో తెలుగు, ఇంగ్లీష్​లో ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థి అందులో చదువుకొని రాస్తారని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు... ఏపీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ap inter results 2021: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..

ABOUT THE AUTHOR

...view details