రాష్ట్రంలో 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హెచ్‌వోడీ కార్యాలయాలకు సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభించామని.. 15 కోట్ల పేజీలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. అందుకోసం ఓ ప్రైవేటు సంస్థను సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు.
పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా: రజత్ భార్గవ - పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా వార్తలు
రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపిన ఆయన.. పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
"పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్‌ను రిజిస్ట్రేషన్ శాఖ అమలుచేస్తోంది. రాష్ట్రంలో 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా. 2021-22లో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున స్థిరాస్తి లావాదేవీలు. రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం ద్వారా రూ.7,327 కోట్ల ఆదాయం. 20.76 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది." -రజత్ భార్గవ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: High Court: ఉన్నతవిద్యా మండలి కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలి: హైకోర్టు