ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పట్టుగూళ్లు కొనుగోళ్లు నిలిపివేత... రైతులు ఇక్కట్లు - లాక్ డౌన్ నేపథ్యంలో పట్టు రైతులు ఇబ్బందులు

కరోనా వైరస్​ను నియంత్రించడానికి చేపట్టిన లాక్ డౌన్ నేపథ్యంలో పట్టుగూళ్లు విక్రయించుకోవడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

stopped silk purchases
పట్టుగూళ్లు కొనుగోళ్లు నిలిపివేత...రైతులు ఇక్కట్లు

By

Published : Mar 30, 2020, 4:13 PM IST

పట్టుగూళ్లు కొనుగోళ్లు నిలిపివేత...రైతులు ఇక్కట్లు

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పట్టుగూళ్ల మార్కెట్లలో కొనుగోళ్లు నిలిపి వేసిన కారణంగా.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమకు చెందిన పలువురు రైతులు పట్టుగూళ్లు తెచ్చి ఈ మార్కెట్లలో విక్రయించేవారు. గూళ్లు సిద్ధమయ్యాక.. వాటిని స్టీమ్‌ చేయాలి. లేదంటే పురుగులు రంధ్రాలు చేసుకుని బయటకు వచ్చేస్తాయి. ప్రస్తుతం తయారైన పట్టుగూళ్లను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు వీలు లేక.. రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తమది.. నిల్వకు అవకాశం లేని పంట అని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details