తెలుగుదేశం నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నల పై హత్యాయత్నం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాచర్లలో దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విడివిడిగా లేఖలు రాశారు. శాంతి భద్రతలు సరిగా లేనందున ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో ఓ వర్గం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంపై అధికారపార్టీ నేతల దాడులు అరికట్టాలని డీజీపీని కోరారు. వైకాపా దాడుల నియంత్రణకు జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీకి చంద్రబాబు లేఖలు !
మాచర్లలో విధ్వంసానికి పాల్పడిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీలకు ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. బొండా ఉమా, బుద్దా వెంకన్నల పై హత్యాయత్నం జరిగిందన్నారు. శాంతి భద్రతలు అదుపులో లేనందునే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీకి చంద్రబాబు లేఖలు
ఇదీచదవండి
మాచర్లలో ఉద్రిక్తత: బుద్దా, బోండా ఉమపై వైకాపా శ్రేణుల దాడి