ఓ మంత్రి సహా అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫోన్‌లో రికార్డైన మాటలు తమది కాదని వారంటున్నందున విచారణ కోరతామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తామన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
VASIREDDY PADMA: 'ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరం' - మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం
రాష్ట్రంలో రాజకీయ నేతల ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోబోదని ఆమె స్పష్టం చేశారు.
నేతల ఆడియో టేపుల వ్యవహారంపై స్పందించిన మహిళా కమిషన్
TAGGED:
audio tapes of leaders