ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఆదాయంపై కరోనా తీవ్రమైన దెబ్బ - state income decreases duet o corona virus

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కరోనా, లాక్‌డౌన్‌ అతలాకుతలం చేస్తున్నాయి. అన్ని రకాల ఆదాయ వనరులు క్షీణిస్తున్న పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించగా ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, వాహన విక్రయాలు, గనుల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోయింది.

state income decreases duet o corona virus
రాష్ట్ర ఆదాయంపై కరోనా తీవ్రమైన దెబ్బ

By

Published : Apr 7, 2020, 5:22 PM IST

రాష్ట్ర ఆదాయంపై కరోనా తీవ్రమైన దెబ్బ

కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు దిగజారుతూ వస్తోంది. వివిధ శాఖల ద్వారా సమకూరే ఆదాయం... ఒక్కసారిగా స్తంభించింది. రాష్ట్ర ఖజానాలోకి నిధుల రాక దాదాపుగా శూన్యమైంది. ప్రతి వారం సగటున వంద కోట్ల ఆదాయమిచ్చే రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి.. మార్చి చివరి వారంలో సుమారు 3 కోట్లు మాత్రమే వచ్చాయి. రోజూ 65 కోట్ల మేర జరిగే మద్యం అమ్మకాలూ... పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేకపోవటంతో... అమ్మకపు పన్ను రాబడి పూర్తిగా ఆగిపోయింది. వాహన విక్రయాల ద్వారా మార్చిలో కేవలం 178 కోట్ల ఆదాయమే సమకూరింది. ఉగాది నేపథ్యం... బీఎస్​4 వాహనాల అమ్మకాల రూపంలో అధిక రాబడి వస్తుందని భావించినా లాక్‌డౌన్‌ వల్ల 100 కోట్లు నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలుగా నెలకు 15వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసుకున్నారు. రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయాలు కలిపి నెలకు 6వేల 500 కోట్లు..... కేంద్రం నుంచి జీఎస్​టీ రూపంలో వారానికి 500 కోట్లు పన్నుల వాటాగా 2వేల కోట్ల వరకూ వస్తుంది. అప్పుల రూపంలో నెలకు 3వేల 500 కోట్లకుపైగా సమకూర్చుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయం, జీఎస్​టీ వసూళ్లపై భారీ ప్రభావం పడింది. కరోనా ఖర్చుల రూపంలో ఎప్పుడూ వెయ్యి కోట్ల వరకూ రిజర్వులో ఉంచుకోవాలనిఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం..రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. తొలి త్రైమాసికంలో పదివేల కోట్ల అదనపు రుణం రిజర్వ్ బ్యాంకు ద్వారా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఆర్థికసంస్థల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తేనే పరిస్థితి నుంచి... గట్టెక్కగలమని కేంద్రానికి తెలియచేసింది. కేంద్రం నుంచి పన్నుల వాటా మొత్తం కూడా ముందే ఇవ్వాలని కోరుతోంది.

ఇదీ చూడండి:

ఆ ప్రాంతాలు మినహా లాక్​డౌన్​ సడలింపు!

ABOUT THE AUTHOR

...view details