ప్రతి జిల్లాలో ఐదారు ప్రైవేటు ఆస్పత్రులను క్లస్టర్‌గా విభజించి ఆకస్మిక తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పలు జిల్లాల్లో నిబంధనలు ఉల్లఘించిన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ కేసులు నమోదు చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌లో విక్రయించిన వారిని, నకిలీ రెమ్‌డెసివిర్ కలిగి ఉన్నవారిని పట్టుకున్నట్లు సింఘాల్ వెల్లడించారు.
రాష్ట్రానికి కేంద్రం సాయం..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అవసరాలకు సరిపడా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని అనిల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల కేంద్రంలో సుమారు 100 టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు ఉపయుక్తంగా ఉంటుందని సింఘాల్ వెల్లడించారు.
అందుకే ఇవ్వలేకపోతున్నాం..