ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కలకలం.. అనుమానితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై.. ప్రభుత్వం అప్రమత్తమైంది. అతడిని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందుతోంది.

state govt alert on carona
state govt alert on carona

By

Published : Mar 4, 2020, 7:32 PM IST

కరోనా వైరస్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకిందని వచ్చిన వార్తలపై.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అతడిని పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించినట్టు అధికారులు తెలిపారు. చికిత్స తీరుపై ఆసుపత్రి సూపరింటెండెంట్​తో మంత్రి ఫోన్​లో మాట్లాడారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతోందన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details