ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికల నిర్వహణకు సిద్ధం' - ap

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఓట్ల తొలగింపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. అర్హులైన వారు సీ-విజిల్‌ యాప్‌, 1950 కాల్‌సెంటర్‌, ఎన్నికల సంఘం వైబ్‌సైట్‌ ద్వారా జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలన్నారు.

గోపాలకృష్ణ ద్వివేది ,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

By

Published : Mar 11, 2019, 2:01 PM IST

Updated : Mar 11, 2019, 2:13 PM IST

గోపాలకృష్ణ ద్వివేది ,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్రంలోఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు మొదలుపెట్టింది.ఏప్రిల్‌ 11న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఓట్ల తొలగింపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు సీ-విజిల్‌ యాప్‌, 1950 కాల్‌సెంటర్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా జాబితాలో తమ పేరు ఉందో లోదో తెలుసుకోవచ్చన్నారు.

18న ఎన్నికల నోటిఫికేషన్

175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని, 25 వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం ఉంటుదని తెలిపారు.

ఓటు నమోదుకు ఈనెల 15 చివరి తేదీ

రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 82 లక్షల 31 వేల 26 మంది ఓటర్లు ఉన్నారని ద్వివేది చెప్పారు. జాబితాలో పేరు లేని వారు, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు ఈనెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 23 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు

ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పూర్తి స్థాయిలో పరీశీలించినట్లు ద్వివేది స్పష్టం చేశారు. 20 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు ప్రింటింగ్ జరుగుతోందని, అవసరమైతే మరో 13 లక్షల కార్డులు ప్రింటింగ్ చేస్తామన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా పర్వాలేదని... కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నా ఓటు వేయటానికి సరిపోతుందని వెల్లడించారు.

నగదు పంపిణీకి అడ్డుకట్ట

రాజకీయ పార్టీల నగదు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రూ.10 లక్షలకు పైగా పట్టుబడితే ఆదాయపన్ను శాఖకు... 10 లక్షల లోపు అయితే పోలీసు శాఖకు విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల 920 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మరో 200 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామనితెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకునిసమస్యాత్మక ప్రాంతాలను నాలుగు గ్రేడ్లుగా విభజించినట్లు రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల 345 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే 13 జిల్లాల అధికారులతో ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ చేశారు. విధుల్లో భాగంగా రవాణా, భద్రతపైప్రత్యేక ప్రణాళికలురూపొందించుకోవాలన్నారు. సిబ్బంది, వెబ్ కాస్టింగ్, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు (బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్), వీవీప్యాట్, ఎన్నికల సామగ్రి తదితర ప్రతి ఒక్క అంశాన్ని సూక్ష్మంగా పరిశీలన చేసుకొని సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Last Updated : Mar 11, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details