జగన్తో మోదీ లాలూచీ పడ్డారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్కు అండగా నిలవటంతోనే మోదీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. అమరావతి , పోలవరంపై జగన్ తన పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. మోదీ, జగన్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరన్నారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు.
మోదీ పతనం ప్రారంభం : బుద్ధా వెంకన్న
జగన్తో ప్రధాని మోదీ లాలూచీ పడ్డారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. జగన్కు అండగా నిలవటంతోనే మోదీ పతనం ప్రారంభమైందన్నారు.
బుద్ధా వెంకన్న