నిత్యం ఇంటి పనులతో తీరికలేకుండా గడిపే గృహిణులు.. ర్యాంప్ వాక్ చేసి ఆహుతులను అలరించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో తేజస్ ఎలైట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి అమరావతి ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో... ర్యాంప్ వాక్ చేసి గృహిణులు సందడి చేశారు. ఒంటరిగా, జంటగా, గ్రూపుగా ప్రదర్శనలిస్తూ ఆకట్టుకున్నారు.
అదరహో అనిపించిన శ్రీమతి అమరావతి ఆడిషన్స్ - విజయవాడలో శ్రీమతి అమరావతి ఆడిషన్స్
నిత్యం తీరిక లేకుండా గడిపే గృహిణులు ర్యాంప్ వాక్‌తో అలరించారు. శ్రీమతి అమరావతి ఆడిషన్స్‌లో ఉత్సహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో ఫ్యాషన్ షోలో పోటీపడ్డారు.
Srimathi amaravathi
అనాది కాలం నుంచి వస్తోన్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించంతోపాటు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు టి.తేజస్విని, ప్రదీప్ తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించిన ఆడిషన్‌లో 30 మంది మహిళలు పాల్గొన్నారు. 25 మంది తుది పోటీలకు అర్హత సాధించారు. నవంబరులో ఫైనల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి :బాలకృష్ణ 'నర్తనశాల' ట్రైలర్ వచ్చేసింది
Last Updated : Oct 22, 2020, 11:01 PM IST