ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రంజాన్‌లో దానాలకు ప్రత్యేక వేళలు - రంజాన్‌లో దానాలకు ప్రత్యేక వేళలు

పవిత్ర రంజాన్‌ మాసంలో పేదలకు దానం చేసేందుకు ముస్లిం దాతలు నిర్దిష్ట వేళల్లో బయటకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని వక్ఫ్‌బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం ఇఫ్తార్‌ సమయానికి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ అమ్మకానికి అనుమతిచ్చి, అవి ముస్లింలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు బోర్డు తెలిపింది.

రంజాన్‌లో దానాలకు ప్రత్యేక వేళలు
రంజాన్‌లో దానాలకు ప్రత్యేక వేళలు

By

Published : Apr 24, 2020, 10:03 AM IST

పవిత్ర రంజాన్‌ మాసంలో పేదలకు దానం చేసేందుకు ముస్లిం దాతలు నిర్దిష్ట వేళల్లో బయటకు రావచ్చని, అందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని వక్ఫ్‌బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత దూరం పాటిస్తూ తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు బయటకు వచ్చి దానం చేయవచ్చని పేర్కొంది. సాయంత్రం ఇఫ్తార్‌ సమయానికి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ అమ్మకానికి అనుమతిిచ్చి, అవి ముస్లింలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం కల్పించే ఇతర వెసులుబాట్లను వక్ఫ్‌ బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.

నగరాల్లోని కొన్ని హోటళ్లను గుర్తించి సహరి, ఇఫ్తార్‌ సమయాల్లో భోజనం, ఇతర తినుబండారాలు అందుబాటులో ఉండేలా చూడాలి.

క్వారంటైన్‌లో ఉన్న ముస్లింలకు సహరి, ఇఫ్తార్‌ సమయాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలి.

5 పూటల నమాజు చదివేందుకు వీలుగా ఇమామ్‌, మౌజమ్‌, మరో ముగ్గురికి ఇంటి నుంచి మసీదుకు వెళ్లేందుకు అనుమతివ్వాలి.

కూరగాయలు, పండ్లు, మిగతా అన్ని నిత్యావసర సరకులు ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంచాలి.

ఈ వివరాలను ప్రతి మసీదు ఆవరణలో ప్రదర్శించాలి.

ఇదీ చూడండి:'ముస్లిం సోదరులు రంజాన్​ను ఇంట్లోనే చేసుకోండి'

ABOUT THE AUTHOR

...view details