చిన్నారుల తల్లులకు సౌకర్యవంతంగా ఉండేలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో... శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదిని సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి.హనుమంత్ రెడ్డి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి & అర్డున్ అవార్డు గ్రహీత సిక్కిరెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక అభినందనలు...
రైలు ప్రయాణికులకు వసతులు కల్పించడంలో రైల్వే ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా అన్నారు. అందులో భాగంగా ఈ గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణం కోసం వేచి ఉండే తల్లులు.. వారి శిశువులకు పాలిచ్చేందుకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన వసతి ఉండాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు సహాయం చేసిన రోటరీ క్లబ్‌ను రైల్వే మేనేజర్ ప్రత్యేకంగా అభినందించారు.