శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను 2020 డిసెంబరు 31 తేదీ వరకూ లేదా పాలకవర్గం ఏర్పాటు అయ్యేంత వరకూ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం మినహా మిగతా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలోనూ డిసెంబరు 31వ తేదీ నాటికి ప్రత్యేకాధికారుల పాలన పొడిగించారు. శ్రీకాకుళంలో అక్టోబరు 10వ తేదీ వరకూ పొడిగింపు ఇచ్చినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 2021 జనవరి 2వ తేదీ వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. కొవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటంతో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది.
ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ.. పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ
ఏపీలో 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ.. పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కార్పొరేషన్లలో ఈ ఏడాది మార్చి 10వ తేదీతో మున్సిపాలిటీల్లో జూన్ 30, నగరపంచాయతీల్లో జులై 2 తేదీన ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది.
ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ.. పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ