Counter to RGV: ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్వీట్‌పై పోలీసు శాఖ వెంటనే చర్యలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరును వ్యంగ్యంగా వాడటం అంటే.. రాంగోపాల్‌వర్మ తన పరిధికి మించి వ్యవహరించారని విమర్శించారు.
'రాంగోపాల్ వర్మకు.. మానసిక వైద్యుడి అవసరం ఉంది' - ఆర్జీవీ లేేటేస్ట్ ట్వీట్
Somu Veerraju on RGV: భాజపా రాష్ట్రపతి అభ్యర్థిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే ఓ మానసిక వైద్యునికి వర్మను చూపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Somu veerraju criticized the rgv tweet
వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని... అదేవిధంగా పేరొందిన మానసిక వైద్యునికి వర్మను చూపించాల్సిన అవసరం ఉందని వీర్రాజు పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్ర హద్దును దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: