SOMU VEERRAJU: కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా ఇవ్వడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేద ప్రజలకు ఆకలి బాధలు తప్పడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం నీరుగారుస్తోందని విమర్శించారు. నీతి అయోగ్ 86 లక్షల మంది లబ్దిదారులను గుర్తిస్తే.. రాష్ట్రం మాత్రం కోటి 47 లక్షల మందికి పంపిణీ చేస్తుందని... మిగతా వారు వైకాపా కార్యకర్తలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పేదలకు బియ్యం ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
పేద ప్రజల ఆకలి బాధలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం: సోము వీర్రాజు - ఏపీ తాజా వార్తలు
SOMU VEERRAJU: కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకుండా.. వైకాపా నేతలు అమ్ముకుంటున్నారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ప్రతినెలా అందించే ఉచిత బియ్యాన్ని అందించడం లేదంటూ..విజయవాడలో నిరసన తెలిపారు.
"పేదలకు కేంద్రం సాయం.. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం"