ప్రపంచ యుద్ధానికి మించిన విపత్తు ఇప్పుడు కరోనా రూపంలో ఉంటే... ఎన్నికలు నిర్వహించి ప్రజలను ఏం చేద్దామనుకున్నారని... తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించి ఉంటే... ఎంత నష్టం జరిగేదో సీఎస్ ఆలోచించుకోవాలని హితవుపలికారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్... రోజుకు రెండున్నర కిలోలు పారాసిటమాల్ టాబ్లెట్ వాడమనటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు..?' - somireddy speech about local body elections in andhrapradesh
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అధికారులకు తగదని... తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల పట్టాలే పంపిణీ చేసే పరిస్థితులు లేనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని సీఎస్ నీలం సాహ్ని ఎలా అన్నారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై మండిపడుతున్న సోమిరెడ్డి