ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ నాయకులకూ... దూరం తప్పనిసరి' - @corona ap cases

కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్ నిబంధనలకు గౌరవిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని రాజకీయ నాయకులకు హైకోర్టు స్పష్టంచేసింది.సామాజిక దూరం పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపింది.

'రాజకీయ నాయకులకూ... దూరం తప్పనిసరి'
'రాజకీయ నాయకులకూ... దూరం తప్పనిసరి'

By

Published : Apr 8, 2020, 4:01 AM IST

లాక్​డౌన్​ నిబంధన ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ప్రస్తుత పరిస్థితుల్లో సామూహిక సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం మేలని అభిప్రాయం వ్యక్తం చేసింది.హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.లాక్​డౌన్ నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్ష జరిపేందుకు మార్చి 30న విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భౌతిక దూరం పాటించలేదని పేర్కొంటూ న్యాయవాది గూడపాటి ,లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం భౌతిక దూరం పాటించేలా ఆదేశించాలని కోరారు.మంత్రి పై చర్యలకు సిఫారసు చేయాలన్నారు.ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ABOUT THE AUTHOR

...view details