పక్కదారి పట్టించేందుకే తెరాస కుట్రలు - modi
రైల్వే జోన్ , ప్రత్యేకహోదా పై ఏపీ ప్రజలను పక్కదారి పట్టించేందుకే డేటా చోరీ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లెేవనెత్తిందని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆరే చేపట్టారని విమర్శించారు.
డేటా చోరీ అంశాన్ని తెరమీదకు తెచ్చి రైల్వే జోన్... ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. 2015లో తెలంగాణలో సమాచార చౌర్యం జరిగిందన్నారు. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆరే చేపట్టారని... నిజమా... కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని 'నమో' యాప్‌లో 30 కోట్ల మంది డేటా ఉందన్నారు. ఒకవేళ డేటా చౌర్యం చేయాలంటే కార్యాలయం అమెరికాలో పెడతారు కానీ... హైదరాబాద్‌లో పెట్టరని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు సిట్‌ను ఏర్పాటు చేశాయన్నారు.