ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గోశాలలో ఘోరం'.. దర్యాప్తునకు సిట్ నియామకం - sit_on_vijayawada_cows_died

విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు నియమించారు.

sit_on_vijayawada_cows_died

By

Published : Aug 12, 2019, 10:38 PM IST

తాడేపల్లి గోశాలలో ఆవుల మృతి ఘటనను.. పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ బృందం పని చేయనుంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఇద్దరు ఇన్​స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు సిట్​లో పని చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details