దక్షిణ భారతదేశంలో సింగపూర్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన పోంగ్ కాక్ టియాన్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, గతంలో సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్, స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేసేందుకు సింగపూర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎస్ సుబ్రమణ్యం.. సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. కాన్సులేట్ జనరల్‌తో పాటు సింగపూర్‌కు చెందిన ప్రతినిధుల బృందం ఈ భేటీకి హాజరైంది.
''ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఎప్పుడూ సిద్ధమే''
దక్షిణ భారత సింగపూర్ కాన్సులేట్ జనరల్ పోంగ్ కాక్ టియాన్.. బుధవారం సీఎస్ సుబ్రమణ్యంతో భేటీ అయ్యారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి సీఎస్‌ను కలుసుకున్న టియాన్ పలు అంశాలపై చర్చించారు.
సీఎస్ సుబ్రమణ్యంతో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ