ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SI Suicide Attempt: నిద్రమాత్రలు మింగి ఎస్సై ఆత్మహత్యాయత్నం - కృష్ణా జిల్లా క్రైం వార్తలు

విజయవాడ దిశ పోలీసు స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.(SI Vijaykumar Suicide Attempt ). ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SI Vijaykumar Suicide Attempt
విజయవాడలో ఎస్సై ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 9, 2021, 7:19 PM IST

విజయవాడలో ఎస్సై కె.విజయకుమార్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. విజయవాడ దిశ పోలీసు స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు(SI Vijaykumar Suicide Attempt). వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు.. ఆసుపత్రికి చేరుకున్నారు.

దేవీనగర్​లోని ఆయన స్వగృహంలోనే ఆత్మహత్యకు (si Suicide attempt by take sleeping pills) యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణం పనిఒత్తిడా?. ఆరోగ్య సమస్యలా అనే కోణంలో విచారిస్తున్నారు.

ఇదీ చదవండి.. :ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details