కరోనాతో ఒకే కుటుంబంలో తండ్రీ కుమారులు 2 రోజుల క్రితం మృతి చెందగా... వారు బతికి ఉన్నట్లు, కోలుకుంటున్నట్టు.. కుటుంబసభ్యులకు ప్రభుత్వం నుంచి సంక్షిప్త సమాచారం వస్తోంది. ఇది వారి బంధువులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
విజయవాడ వన్ టౌన్ కేఎల్ రావు నగర్‌కు చెందిన శంభానీ రమణ (52) అతని కుమారుడు లీలా కుమార్ కరోనా బారిన పడి ఈనెల 10న తండ్రి, 11న కుమారుడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిరువురు ఆరోగ్యశ్రీ పథకం క్రింద చిక్సిత పొందారు. అయితే.. మృతులకు సంబంధించి ఆరోగ్యం ఇంకా నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వం నుంచి సంక్షిప్త సమాచారం వస్తుండటంతో మృతుల కుటుంబీకులు కలత చెందుతున్నారు.
చనిపోయిన వారు బతికే ఉన్నారని తప్పుడు సమాచారాన్ని పంపడం ఏంటని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య శ్రీ బిల్లుల కోసం ఆసుపత్రి నిర్వాహకులు ఎమైనా అక్రమ దారులు తొక్కున్నారేమోనని.. ఈ విషయంపై అధికారులు స్పందించాలని బంధువులు కోరుతున్నారు.