మానవ హారానికి పిలుపునిచ్చిన శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామిని విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. శైవ క్షేత్రంలోనే ఆయనను గృహ నిర్బంధించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు విడిచిపెట్టారు. అనంతరం దుర్గా ఘాట్లో కృష్ణానదికి హారతినిచ్చిన ఆయన.. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో మతతత్వ పాలన కొనసాగుతోందని.. హిందువులను భయబ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని శివస్వామి ఆరోపించారు.
'పోలీసులను అడ్డం పెట్టుకుని హిందువులను భయపెడుతున్నారు'
శాంతియుతంగా మానవహారం నిర్వహిస్తామంటే.. ప్రభుత్వం అనుమతివ్వకపోగా గృహ నిర్బంధం చేసిందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మానవాహారాన్ని అడ్డుకున్న పోలీసులు.. శివస్వామి గృహ నిర్బంధం
శాంతియుతంగా మానవహారం నిర్వహిస్తామని ప్రకటిస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా గృహ నిర్బంధం చేసిందని మండిపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి:పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్