ఖైరతాబాద్ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో... ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ప్రత్యేకంగా తెప్పించిన వాహనాలు వాడారు. ఎస్టీసీకి చెందిన ట్రాలీ, ఆధునిక క్రేన్లను వినియోగించారు. ఆ డ్రైవర్ ఇప్పటికే ఆరు సార్లు మహాగణపతిని తరలించిన అనుభవం ఉంది. ఈ సారీ ఆయన ఆధ్వర్యంలోనే.. మహా గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రక్రియను విజయవంతం చేశారు.
26 టైర్ల భారీ లారీ...
గణపతిని శోభాయాత్రగా తరలించేందుకు వాడుతున్న ట్రాలీ 55 టన్నుల బరువును సునాయాసంగా తీసుకెళ్లగలుగుతుంది. ఇరవై ఏళ్లుగా ఎస్టీపీకి చెందిన ట్రాలీని ఈ సేవకు ఉపయోగిస్తున్నారు. దీనికి 26 టైర్లు ఉంటాయి. 11 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుంటుంది. డ్రైవర్ భాస్కర్‌రెడ్డి ఇప్పటి వరకు ఆరు సార్లు శోభాయాత్రలో నడిపారు.
జర్మనీ టెక్నాలజీ క్రేన్
వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఉపయోగించే ఆధునిక క్రేన్‌ను జర్మనీ టెక్నాలజీతో రూపొందించారు. రిమోట్ కంట్రోలింగ్ ద్వారా పనిచేసే సదుపాయం దీని సొంతం. బరువును ఎత్తగానే ఎంత బరువు ఉంది, ఎంత దూరం ముందుకు తీసుకెళ్లగలదో చూపిస్తుంది. ఈ వాహనం బరువు దాదాపు 72 టన్నులు. 400 టన్నుల మేర ఎత్తుగల సామర్థ్యం ఉంటుంది. జాక్ 61 మీటర్ల ఎత్తు వరకు లేపగలదు. పొడవు 14 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. 12 టైర్లు ఉంటాయి. డ్రైవర్ దేవేందర్‌సింగ్ గత ఏడాదీ పాల్గొన్నాడు.