ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం - హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం

New Judges: నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీలు ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు.

నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం
నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం

By

Published : Aug 4, 2022, 8:41 AM IST

New Judges For AP High Court: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు కొత్త జడ్జీలు ఇవాళ ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు , దుప్పల వెంకటరమణతో ప్రమాణం చేయించనున్నారు.

గవర్నర్ అధికారం బదలాయించడం ద్వారా... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిగిలిన న్యాయమూర్తులను ప్రమాణం చేయించడం అనవాయితీగా వస్తోంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మాతృమూర్తి కన్నుమూసిన కారణంగా సీజే ప్రమాణం చేయించే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. దీంతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details