ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద భద్రత పెంపు - రాష్ట్ర ఎన్నికల కమిషన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బస చేస్తోన్న కార్యాలయం, నివాసం వద్ద పోలీసులు గట్టి నిఘా, భద్రతను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ ఈసీ వాయిదా వేశారు. ఈనేపథ్యంలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ap state election commission
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత

By

Published : Mar 16, 2020, 6:21 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికలను కమిషన్ ఆరువారాల పాటు వాయిదావేశారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తెలుగుదేశం, భాజపా, జనసేన స్వాగతించగా... వైకాపా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద....రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ కార్యాలయం, నివాసం వద్ద... పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి-'కేంద్రంతో చర్చించాకే ఎన్నికలు వాయిదా వేశాం'

ABOUT THE AUTHOR

...view details