ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అది..డెంగీ కాదు.. మలేరియా కాదు.. కానీ డేంజర్! - విజయవాడలో స్క్రబ్ టైఫస్ న్యూస్

జ్వరం ఎక్కువగా  ఉండి  కాళ్లు నొప్పులున్నాయా? డెంగీ పరీక్ష చేసినా నిర్ధారణ కాలేదా ? అయితే ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే. లేకపోతే.. చాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోకపోతే.. ఆరోగ్య సమస్యలతో వణికిపోవాల్సిందే.

scrub-typhus-in-vijayawada
scrub-typhus-in-vijayawada

By

Published : Dec 17, 2019, 8:32 AM IST

విజయవాడకు చెందిన రామ్‌కు 20 ఏళ్లు. ఒకరోజు ఉన్నట్టుండి తీవ్రమైన చలి జ్వరం, తలనొప్పి, ఒళ్లు, కండరాల నొప్పులతో బాధపడుతూ స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన మందులతో జ్వరం తగ్గలేదు సరికదా.. ఎక్కువై పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వ్యాధి తీవ్రత బట్టి వైద్యులు డెంగీగా భావించి చికిత్స మెుదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా జ్వరం తగ్గలేదు. కొన్ని చికిత్సలు చేయిస్తే.. అప్పుడు తెలిసింది.. రామ్‌కు సోకింది మలేరియా.. డెంగీ కాదనే విషయం. అది స్క్రబ్ టైఫస్ అనే ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించారు. చికిత్స చేసి రామ్‌ను కాపాడారు డాక్టర్లు. ఇప్పుడు అదే.. స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియాతో బెజవాడ ప్రజలు వణుకుతున్నారు.

వైరల్ జ్వరాల్లో 30 రకాలు ఉంటాయి. టైఫస్ లాంటి జ్వరాలు పరీక్షలు చేసి నిర్ధారించేందుకు అన్ని చోట్ల సౌకర్యాల్లేవు. దీనిని ముందుగా గుర్తిస్తే వైద్య చికిత్స చేసి కచ్చితంగా తగ్గించొచ్చని వైద్యులు హామీ ఇస్తున్నారు. టైఫస్ ప్రభావం కాలేయం, ఊపిరితిత్తులు, మెదడుపై పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిక. ఈ జ్వరం సోకినపుడు త్వరగా గుర్తించి వైద్యం అందించకపోతే 10 నుంచి 60 శాతం మరణించే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
స్క్రబ్‌ టైఫస్‌ అంటే...?
స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి ఓరియంటియో ఇసుగా ముషి అనే పురుగు కుట్టడం వల్ల వస్తుంది. ముందుగా ఈ పురుగు ఎలుకను కుట్టి.. ఆ తర్వాత మనిషిని కుడితే... ఈ తరహా వైరస్ వస్తుంది. పురుగు కుట్టిన తర్వాత ఒంటిపై నల్లటిమచ్చ ఏర్పడుతుంది. దాని చుట్టూ ఎర్రగా కమిలినట్లు ఉంటుంది. దీని బారినపడి వారికి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. విజయవాడలో ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యనిపుణులు భావిస్తున్నారు. వ్యాధి వ్యాప్తికి కారకాలైన పురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇంటి పరిసరాల్లో పురుగులు, కీటకాలకు ఆవాసంగా ఉండేలా మొక్కలు, పొదల్లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల శరీరం, చేతులు, కాళ్లు మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని సూచిస్తున్నారు.

అది..డెంగీ కాదు.. మలేరియా కాదు.. కానీ డేంజర్!

ఇదీ చదవండి: ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...!

ABOUT THE AUTHOR

...view details