ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంధకారంలోకి నెట్టారు: శైలజానాథ్

వైకాపా ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ అంధకారంలోకి నెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంధకారంలోకి నెట్టారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంధకారంలోకి నెట్టారు

By

Published : Feb 23, 2022, 6:30 PM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ అంధకారంలోకి నెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. తట్టెడు మట్టి వేయకుండా, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, కోట్ల రూపాయల నిధులు ఏం చేశారో సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే వేల కోట్ల వ్యయం చేయడంపై కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో 94 వేల కోట్లకు పైగా ఖర్చుచేశారని వెల్లడించడాన్ని చూస్తే ప్రభుత్వం ఎన్ని నిధులను దుర్వినియోగం చేసిందో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఇన్ని తప్పులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలస్​లో కూర్చుని తమాషా చూస్తున్నారని శైలజనాథ్ ఆరోపించారు.

అది అనవసర ప్రక్రియ..

కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవటమేనని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదని, 13 అదనపు జిల్లా కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించే ఆర్థిక శక్తి, ఈ ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఎలక్ట్రానిక్ పాలన సాగుతున్న ఈ రోజుల్లో అదనపు జిల్లాలు అవసరమా ? అని నిలదీశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవన్నారు. వీరి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి

Police Notice: అయ్యన్న ఇంటికి పోలీసు నోటీసులు.. ఎందుకంటే ?

ABOUT THE AUTHOR

...view details