కరోనా కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన దివ్యాంగుల సదరం క్యాంపులను పునః ప్రారంభించాలని ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి సదరం క్యాంపులను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్యాంపుల ద్వారా ధృవీకరణ పత్రాలను పొందే దివ్యాంగులు ముందస్తుగా.. ఈ-సేవలో 16 నుంచి స్లాట్లను బుకింగ్ చేసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశారు.
SADAREM CAMP:ఈ నెల 19 నుంచి దివ్యాంగుల సదరం క్యాంపులు ప్రారంభం - దివ్యాంగుల సదరం క్యాంపులు
దివ్యాంగుల సదరం క్యాంపులను పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
దివ్యాంగుల సదరం క్యాంపుల పునః ప్రారంభానికి ఆదేశాలు