ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bus Driver Misbehavior: ప్రయాణికురాలితో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన - ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన

Bus driver Obscene behavior with women at Nellore: ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చాల్సిన బస్సు డ్రైవర్లు.. బస్సులలోనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న బస్సులో డ్రైవర్​ మహిళపై అత్యాచారం చేయగా.. తాజాగా నెల్లూరు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ ఫిర్యాదులో డ్రైవర్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించారు అధికారులు.

ప్రయాణికురాలితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
Bus driver Obscene behavior with women in bus

By

Published : Mar 3, 2022, 9:13 AM IST

ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో ఓ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నెల్లూరు 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి విశాఖకు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ జనార్దన్.. ఒంటరిగా ఉన్న, పక్కన కూర్చున్న మహిళ పట్ల చెడుగా ప్రవర్తించాడు. సదరు మహిళ ఈ మేరకు విజయవాడలో పీఎన్‌బీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేసిన ఉన్నతాధికారులు..తక్షణమే డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్‌తో బస్సును విశాఖ పంపారు. సదరు డ్రైవర్​పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details