తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ మల్లేశంతోపాటు అతని తల్లి పెద్దమ్మ, భార్య చంద్రకళ, మరో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో కొందరిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు.
కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల వివరాలు
1. మల్లేశం (ఆటోడ్రైవర్)
2. పెద్దమ్మ ( ఆటో డ్రైవర్ తల్లి )