దస్తావేజుల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. విజయవాడలోని విద్యుత్ సౌధాలో 13 జిల్లాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు, డీఐజీలతో మంత్రి సమావేశమయ్యారు. రెవెన్యూ వసూళ్లు... లక్ష్యానికి అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు, కమిషనర్ శ్రీధర్ ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే... రెవెన్యూ వసూళ్లలో వృద్ధి కనిపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి విశాఖ, కృష్ణాజిల్లాల్లో...దస్తావేజుల రిజిస్ట్రేషన్ అయిన గంటన్నరలోపే పత్రాలు ఇచ్చేలా ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని....ఈ విధానాన్ని దశల వారీగా ఇతర జిల్లాలకూ వర్తించేలా చేస్తామన్నారు. 22ఏ కింద నిషేధంలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించే సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు
రిజిస్ట్రేషన్ అయిన గంటన్నర లోపే పత్రాలు: రెవెన్యూ మంత్రి - revenue minister
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ....ప్రస్తుతం వాటి మధ్య అంతరాన్ని తగ్గించి రైతులు, ప్రజలకు కలిగే ఇబ్బందులను దూరం చేయనున్నట్లు వివరించారు. విజయవాడలోని విద్యుత్ సౌధాలో 13 జిల్లాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు, డీఐజీలతో మంత్రి సమావేశమయ్యారు.
రిజిస్ట్రేషన్ అయిన గంటన్నర లేపే పత్రాలు: మంత్రి పిల్లి సుభాష్