RTC Officials Respond to ETV Bharat Story: ఏప్రిల్ 5న ఈటీవీ భారత్ లో 'కర్కశ కలియుగంలో మచ్చుకైనా కానరాని మానవత్వం..!' కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణంలో అచేతన స్థితిలో ఉన్న వృద్ధరాలి స్థితిపై రాసిన కథనాన్ని ఈటీవీ భారత్లో చూసి, వైద్యం అందించేందుకు ఆర్టీసీ అధికారులు ముందుకు వచ్చారు. ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దాహంగా ఉందన్న ఆమెకు ముందుగా పళ్ల రసాన్ని ఆర్టీసీ ఉద్యోగి తెప్పించి తాగించారు. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వృద్ధురాలిది జగ్గయ్యపేట అని చెప్పినట్లు రమేష్ తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను స్వస్థలానికి పంపే ఏర్పాట్లు కూడా చేస్తామని వివరించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలి వైద్యానికి ముందుకొచ్చిన ఆర్టీసీ అధికారులు
RTC Officials Respond to ETV Bharat Story: ఏప్రిల్ 5న ఈటీవీ భారత్ లో 'కర్కశ కలియుగంలో మచ్చుకైనా కానరాని మానవత్వం..!' కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. విజయవాడ బస్ స్టేషన్ లో పడిఉన్న వృద్ధురాలికి వైద్యం సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.
RTC Officials Respond to ETV Bharat Story