'నమ్మిన బంధువులే...అత్యాచారం చేశారు నాన్న' - rape
వరుస అత్యాచార ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఓ వైపు...అత్యాచార నిందితులను ఉరి తీయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతుంటే...మరోవైపు ఎక్కడో ఓ చోట ఇలాంటి పైశాచికత్వాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువులే కదా అని ఆశ్రయం ఇస్తే.. ఏడాదిగా బాలికపై అత్యాచారం చేస్తున్న ఘటన ఇప్పుడు విజయవాడలో వెలుగుచూసింది
విజయవాడలో పెయిటింగ్ వృత్తే జీవనోపాధిగా బతుకుతున్నాడో వ్యక్తి. ఆయన వద్దకు సమీప బంధువులు పని కోసం వచ్చారు. బంధువులే కదా అని దగ్గర ఉంచుకుంటే.. నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. తన కూతురు(17)కు 2018 నుంచి మాయ మాటలు చెప్తూ అత్యాచారం చేశారు. కొంతకాలంగా బాలిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. నమ్మిన బంధువులే తనపై అత్యాచారం చేస్తూ హింసిస్తున్నారని తండ్రి ముందు బాలిక కన్నీటి పర్యంతమైంది. వరుసకు బాబాయి అయిన వ్యక్తి కూడా వదల్లేదంటూ గొల్లుమంది. ఈ మేరకు బాలిక తండ్రి సత్యనారాయణపురం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ బాల మురళీకృష్ణ తెలిపారు.